YSRCP: ఘ‌నంగా వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు...! 1 y ago

featured-image

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి..

ఇది పేరు కాదు.. ఒక చరిత్ర..

ప్రజల మధ్య పుట్టిన ప్రజా నాయకుడు వైఎస్ జ‌గ‌న్‌..

లక్షలాది గుండెల్లో నిలిచిపోయిన పేరు జ‌గ‌న్‌..

జ‌గ‌న్‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర..

ఒక‌సారి జ‌గ‌న్ గ‌తాన్ని చూస్తే.. ఎన్నో క‌ష్టాలు.. ఎన్నో ఇబ్బందులు.. ప్ర‌జ‌ల‌కు మంచి చేయడానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్‌కు అన్నీ ఎదురు దెబ్బ‌లే త‌గిలాయి. కానీ ఏ మాత్రం భ‌య‌ప‌డ‌లేదు, నిరుత్సాహ‌ప‌డ‌లేదు, వెనుక‌డుగేయ‌లేదు. అన్నీ స‌మ‌స్య‌లను ఎదుర్కొంటూ ఎవ‌రూ ఊహించిన విధంగా బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. 2009లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్, ఆ ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసి అత్య‌ధిక మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నిక‌య్యారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూ, త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తూ పార్ల‌మెంటేరియ‌న్ పెద్ద‌ల మ‌న్న‌న‌లు పొందారు.

నిరంత‌రం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న జ‌గ‌న్ జీవితంలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. రెండోసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నికై ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి వెళుతున్న జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శాశేఖ‌ర్ రెడ్డి ప్ర‌మాద‌వ‌శాత్తూ సెప్టెంబ‌ర్ 3, 2009వ సంవ‌త్స‌రంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం ఒక మిస్ట‌రీ, ఇప్ప‌టికీ ఎవ‌రికీ అర్థంకాని ఒక స‌స్పెన్స్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌ట్టుకోలేక అనేక మంది మ‌ర‌ణిస్తే.. మ‌రికొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. మ‌ర‌ణించిన కుటుంబాల‌కు అండ‌గా ఉండాల‌ని జ‌గ‌న్ ఓదార్పు యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం మొద‌ట ఈ యాత్ర‌కు అంగీకారం తెలిపినా... ఆ త‌రువాత పాద‌యాత్ర చేయ‌డానికి వీల్లేద‌ని హుకుం జారీ చేసింది. అయినా కాంగ్రెస్ ఆదేశాల‌ను ఏ మాత్రం లెక్క చేయ‌ని జ‌గ‌న్ ప‌ద‌విని సైతం ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేందుకే నిర్ణ‌యించుకున్నారు. ఎంపీ ప‌ద‌వికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, క‌డ‌ప ఉప ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ భారీ మెజార్టీతో గెలిచారు. ప్ర‌జా నాయ‌కుడిగా ఎదుగుతున్న జ‌గ‌న్‌ను చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక‌పోయింది. జ‌గ‌న్‌ను ఎలా అయినా అణ‌చి వేయాల‌ని కాంగ్రెస్‌ జ‌గ‌న్‌పై కేసులు వేసి జైలుకు పంపాయి.

అప్పుడే ఆ క్ష‌ణంలోనే పేద‌ల ప‌క్షాన అండ‌గా నిలిచేందుకు, అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌ట్టేందుకే, నిరుపేద‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 2011 మార్చి 12న ఇడుపుల‌పాయ‌లో వైసీపీ ఆవిర్భ‌వించింది. పార్టీ స్థాపించిన నాటి నుంచి జ‌గ‌న్ నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూ, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు తోడుగా నిలిచారు. అనేక మందికి సాయం చేస్తూ పేద‌ల కుటుంబాల్లో పెద్ద కొడుకుగా అవ‌త‌రించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD